- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫస్ట్ ఎప్పటికీ స్పెషలే ! : అదితి
‘ఫస్ట్ ఎప్పటికీ స్పెషలే’ అని చెప్తోంది బ్యూటిఫుల్ లేడీ అదితి రావు హైదరీ. జీవీ ప్రకాష్ హీరోగా వస్తున్న తమిళ్ మూవీ ‘జైల్’కు తనే సంగీతం సమకూర్చాడు. కాగా ఈ సినిమాకు తొలిసారి పాట పాడింది అదితి. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో కలిసి ‘కాత్తోడు కాత్తనెన్’ పాట పాడిన అదితి.. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది. జీవీ ప్రకాష్ వల్లే ఇదంతా సాధ్యమైందంటూ.. తనను ప్రతీసారీ సపోర్ట్ చేస్తున్న అభిమానులకు థాంక్స్ చెప్పింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతుండటం విశేషం. వసంత బాలన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. క్రైక్స్ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీధరన్ మరియతాసన్ సినిమాను నిర్మిస్తున్నారు.
Firsts are always special!
Thank you @gvprakash for literally forcing me to sing this.
Thank you @dhanushkraja for singing this with me. Thank you ALL for the love & making this trend #1 for so long… keep it coming. Means the world♥️https://t.co/tcDhmIMpnP@SonyMusicSouth— Aditi Rao Hydari (@aditiraohydari) June 17, 2020
కాగా, ప్రముఖ కొరియోగ్రఫర్ బృంద గోపాల్‌తో పాటు పలువురు ప్రముఖులు అదితి రావు పాటపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం బృంద గోపాల్ దర్శకత్వంలో ‘హే సినామిక’ సినిమాకు సైన్ చేసింది అదితి. దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. వీటితో పాటు మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలోనూ నటిస్తోంది.