- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటీటీ కంటెంట్ ఓకే.. కానీ థియేటర్స్ సంగతి? :అదితి
దిశ, సినిమా: బ్యూటిఫుల్ హీరోయిన్ అదితి రావు హైదరీ ఇటు సౌత్‌తో పాటు అటు బాలీవుడ్‌లోనూ బిజీ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం తెలుగులో ‘మహాసముద్రం’ మూవీ చేస్తున్న అదితి.. తన అప్ కమింగ్ హిందీ ప్రాజెక్ట్ ‘ది గర్ల్ ఆన్ ది ట్రెయిన్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. పరిణీతి చోప్రా లీడ్ క్యారెక్టర్‌లో వచ్చిన ఈ సినిమాలో పరిణీతి కీ రోల్ ప్లే చేసింది. కాగా మూవీ స్పెషల్ స్క్రీనింగ్‌కు అటెండ్ అయిన భామ.. ఓటీటీ కంటెంట్, థియేటర్స్ ఇంపార్టెన్స్ గురించి మీడియాతో షేర్ చేసుకుంది.
లాక్ డౌన్ సమయంలో ఓటీటీలు మన బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాయని అభిప్రాయపడింది అదితి. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అమేజింగ్‌గా పనిచేస్తున్నాయని.. అక్కడ అద్భుతమైన కంటెంట్ దొరుకుతుందని తెలిపింది. కానీ థియేటర్స్‌లో మ్యాజిక్ ఉంటుందని.. ప్రేక్షకులు వేల సంఖ్యలో తరలివచ్చి సినిమాలు చూడటం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది. ‘ది గర్ల్ ఆన్ ది ట్రెయిన్’ సినిమాను 2019లోనే పూర్తి చేశామని, 2020 సమ్మర్‌లో రిలీజ్ చేయాలనుకున్నా లాక్ డౌన్ వల్ల కుదరలేదని తెలిపింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 26న సినిమా విడుదల అవుతున్నందుకు ఆనందంగా ఉందని, ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌కు బెస్ట్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పింది హైదరీ.