- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రెమ్యునరేషన్‌లో లింగ వివక్ష: అదితి
దిశ, వెబ్ డెస్క్: బ్యూటిఫుల్ హీరోయిన్ అదితిరావు హైదరి రెమ్యునరేషన్ విషయంలో అసమానతల గురించి మాట్లాడింది. నిర్మాతలు లింగ వివక్ష చూపిస్తారని..హీరోలకు అధిక ప్రాధాన్యత, అధిక మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తారని..టాలెంట్ ఉన్నా సరే హీరోయిన్‌కు మాత్రం తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని అభిప్రాయపడింది. హీరోలకు పూర్తిగా చెక్ అందినా సరే..అమ్మాయిలకు మాత్రం కనీసం సగం కూడా చెల్లించరని చెప్పింది.
బిజినెస్‌లో ప్రతి ఒక్కరూ సమానమేనని, పురుషులు, స్త్రీలను సమానంగా చూడాలని కోరింది. అందరూ క్వాలిటీ వర్క్ చేస్తున్నప్పుడు ఇలా లింగ వివక్ష మాని ప్రొఫెషనల్‌గా బిహేవ్ చేస్తే బాగుంటుందని అంది అదితి. ఈ విషయంలో పీపుల్ మైండ్ సెట్ మారాలని సూచించింది.
రెమ్యునరేషన్ విషయంలో లింగ వివక్ష గురించి మాట్లాడే మహిళా నటులు ఉన్నారని, వారు పని చేసే ప్రాజెక్టుల్లో సృజనాత్మకంగా ఉండాలని కోరుకుంటారని, అలాంటి వారిని మార్చగల వస్తువులుగా చూడొద్దని సూచించింది. అందుకే మహిళా నటులు నిర్మాతలుగా మారాలని భావిస్తున్నారని తెలిపింది అదితి. కాగా, అదితి తెలుగులో ‘మహాసముద్రం’ సినిమాలో నటిస్తుంది.