అఫిషియల్ : సీతమ్మ దొరికేసింది!

by Jakkula Samataha |
అఫిషియల్ : సీతమ్మ దొరికేసింది!
X

దిశ, సినిమా: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ నుంచి మరో అప్‌డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. సీతమ్మ ఎవరనే దానిపై ఇండస్ట్రీలో కొన్నిరోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయతే ఎట్టకేలకు ప్రభాస్ సీతను కృతి సనన్‌లో చూశామని ఫిల్మ్ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తనే మా సీత అని, లక్ష్మణుడు సందీప్ సింగ్ అని మొత్తానికి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఈ మేరకు డైరెక్టర్‌తో పాటు ప్రభాస్, కృతి, సందీప్ ఉన్న ఫొటోలు షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా న్యూ జర్నీ స్టార్ట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలుపుతూ ట్వీట్ చేసింది కృతి.

ఇక సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించబోతున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, ఓం రౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాస్ట్ అండ్ క్రూ గురించి త్వరలో మరిన్ని అప్‌డేట్స్ ఇస్తామని.. ఫేక్ న్యూస్ నమ్మరాదని విజ్ఞప్తి చేశారు మేకర్స్.

Advertisement

Next Story