- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లీగల్ ఇబ్బందుల్లో ‘ఆదిపురుష్’
దిశ, వెబ్‌డెస్క్: ప్రభాస్ ఆదిపురుష్ మరోసారి హెడ్‌లైన్స్ టచ్ చేసింది. ఎప్పుడూ మూవీ అప్‌డేట్స్‌తో హెడ్ లైన్స్‌లో నిలిచే ఆదిపురుష్.. ఇప్పుడు కాంట్రవర్సీతో వచ్చేసింది. ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించబోతుండగా.. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో సైఫ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రావణుడిని దయగల, మానవత్వంతో కూడిన వ్యక్తిగా చూపించబోతున్నామని తెలిపారు సైఫ్. అంతేకాదు లక్ష్మణుడు.. రావణుడి సోదరి సూర్పనక ముక్కు కోసినందుకే లంకేశ్వరుడు సీతను అపహరించాడని.. అందులో తప్పేముంది అన్నట్లు మాట్లాడారు. కాగా సైఫ్ మాటలు హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని పిటిషన్ దాఖలైంది.
సనాతన ధర్మం గురించి సైఫ్ ప్రతికూల మాటలు మతపరమైన భావాలను దెబ్బతీశాయని.. ఉత్తరప్రదేశ్ జౌన్‌పూర్ జిల్లాలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం) కోర్టులో ఒక న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. సైఫ్‌తో పాటు దర్శకుడు ఓం రౌత్‌పై కూడా కేసు నమోదు చేశారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సైఫ్ ఇంతకుముందే క్షమాపణలు చెప్పారు.