ఇండ్లు వొదిలి బయటకు రావొద్దు

by Aamani |   ( Updated:2020-04-02 02:46:57.0  )
ఇండ్లు వొదిలి బయటకు రావొద్దు
X

దిశ, ఆదిలాబాద్

కరోనా నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని ఎవరూ బయటకు రావొద్దని జిల్లా కలెక్టర్ ముషరఫ్ ఫారుఖీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం జోహార్‌నగర్ వీధిలో కాలినడకన పర్యటించారు. స్వయంగా మైక్ పట్టుకొని ప్రచారం చేశారు. జోహార్‌నగర్ కు చెందిన వ్యక్తి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో మరణించాడని, ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. జోహార్‌నగర్‌ను సీజ్ చేశామని, 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలు ఎవరూ కూడా బయటకు రావొద్దని కోరారు. అనంతరం ఎన్టీఆర్ మార్గ్, ప్రియదర్శిని నగర్ వీధుల్లో పర్యటించారు. మినీ స్టేడియంలోని కూరగాయల మార్కెట్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు పాల్గొన్నారు.

Tags: Adilabad collector,musharraf sharuqi,compaign

Advertisement

Next Story