ఆనంద నిలయాన్ని పూర్తి చేయండి !

by srinivas |
ఆనంద నిలయాన్ని పూర్తి చేయండి !
X

దిశ, ఏపీ బ్యూరో: గత ప్రభుత్వ హయాంలో టీటీడీ చేపట్టిన ‘ఆనంద నిలయం – అనంత స్వర్ణమయం’ ప్రాజెక్టును కొనసాగించాలని టీటీడీ మాజీ చైర్మన్​ ఆదికేశవుల నాయుడు కుమారుడు శ్రీనివాస్​ సీఎం జగన్​కు విజ్ఞప్తి చేశారు. ఆగిపోయిన ప్రాజెక్టు గురించి గురువారం తిరుమలలో ఆయన సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీనివాస్‌ మాట్లాడుతూ తన తండ్రి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. ఆదికేశవుల నాయుడు టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రాజెక్టు కోర్టు కారణాలు, రాజకీయాల వల్ల ఆగిపోయింది. ఈ ప్రాజెక్ట్‌కు వివిధ ప్రాంతాల నుంచి దాతలు 150కిలోల బంగారం విరాళంగా ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలనే నాన్న చివరి కోరికను నెరవేర్చాలని సీఎంను కోరినట్లు ఆయన వెల్లడించారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్పటి టీటీడీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు ఆనంద నిలయం – అనంత స్వర్ణ మయం ప్రాజెక్టును ప్రారంభించారు. శ్రీవారి ఆలయం మొత్తం పూర్తిగా బంగారు రేకులతో తాపడం చేయించాలని ఆదికేశవులు నాయుడు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story