ఉన్నతాధికారికి పోచమ్మ దర్శనం

by Shyam |
ఉన్నతాధికారికి పోచమ్మ దర్శనం
X

దిశ, నిర్మల్: సారంగాపూర్ మండలం అడెల్లిలోని పోచమ్మ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు.

మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఉప కమిషనర్ విజయ రామారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లికార్జున్ రెడ్డి, డీఈ రాజేశ్, ఏఈలు రామారావు, వేణుగోపాల్ ఆలయ ఈవో మహేష్, సీనియర్ అసిస్టెంట్ రమణారావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story