ఆ లక్ష్యాల అమలుకు పంచాయతీ కార్యదర్శులే కీలకం : అడిషనల్ పీడీ

by Sridhar Babu |
ఆ లక్ష్యాల అమలుకు పంచాయతీ కార్యదర్శులే కీలకం : అడిషనల్ పీడీ
X

దిశ, చండ్రుగొండ: మండల పరిధిలోని నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్ పనులను అడిషనల్ పీడి సుబ్రహ్మణ్యం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం చండ్రుగొండ మండల పరిధిలోని తుంగారం, గానుగపాడు, రేపల్లెవాడ, గ్రామ పంచాయతీల్లో నూతనంగా ప్రారంభిస్తున్న నర్సరీ పనులను గతంలో వేసిన అవెన్యూ ప్లాంటేషన్ లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలను గ్రామాల్లో అమలు చేయుటకు పాలకవర్గం పంచాయతీ కార్యదర్శులు కీలక బాధ్యత వహించాలన్నారు.

అందులో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల్లో నర్సరీ పనులను ప్రారంభించి విత్తనాలు నాటి మట్టి నింపి ప్యాకెట్లను సిద్ధం చేసుకోవాలన్నారు. గ్రామంలో పంచిన ప్రతి మొక్కను బతికించుకునే లా గ్రామస్తులు కూడా అవగాహన కలిగించలన్నారు. ఉపాధిహామీ కొరకు నూతన దరఖాస్తులను స్వీకరించి ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వెంకటేశ్వర్లు, ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story