- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషాను అడ్డుకున్న రైతులు..
దిశ, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఓడితల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనానికి ఆ గ్రామ రైతుల నుంచి అడ్డంకి ఎదురైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి మండలానికి సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో బృహత్ పల్లె ప్రకృతి వనంను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ క్రమంలో ఒడితల గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటులో భాగంగా భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా, జడ్పీ సీఈవో శోభారాణి బుధవారం గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో కొంత మంది రైతులు గత కొన్ని ఏండ్ల నుంచి సదరు భూమిని కాస్తు చేసుకుంటున్నామని వారిని అడ్డుకున్నారు.
ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో వెనుదిరిగిన అధికారులకు రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన అదనపు కలెక్టర్ రెవిన్యూ అధికారులు ఈ భూమిపై సర్వే చేపట్టి హద్దులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, తడి పొడి చెత్త వేరు చేయు కేంద్రాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీంద్రానాధ్. ఎపిఓ హాలీం,సర్పంచ్ ఎర్రబెల్లి సాంబలక్ష్మీ భద్రయ్య, అల్టి నరేందర్, ఏఐవో రమణాకుమార్, పంచాయితీ కార్యదర్శి సునంద పాల్గొన్నారు.