- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెక్స్ కోసం 11 వివాహాలు చేసుకున్న మహిళ.. మరో 28 మందికి ప్రపోజల్!
దిశ, ఫీచర్స్ : మ్యారేజ్ అంటే లైఫ్‌లాంగ్ కమిట్‌మెంట్. జీవిత భాగస్వామితో కలిసి కలకాలం బతికేందుకు వేసే బ్రహ్మముడి. కానీ కాలం మారేకొద్దీ వైవాహిక బంధంలో నిబద్ధత లోపిస్తోంది. యంగ్ జనరేషన్ కపుల్స్ చిన్న చిన్న కారణాలకే డైవోర్స్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకరి తర్వాత ఒకరిని వరుసగా పెళ్లి చేసుకుంటూ పార్ట్‌నర్‌కు కాకుండా వివాహమనే ఆలోచనకు బానిసలవుతున్నారు. ఉటాకు చెందిన మోనెట్ డయాస్ కూడా అదే కోవకు చెందుతుంది. ఇటీవల TLC షో ‘అడిక్టెడ్ టు మ్యారేజ్’లో కనిపించిన సదరు లేడీ.. తన అసాధారణ స్థితి గురించి వెల్లడించింది. అన్నింటి కంటే ముఖ్యంగా ఇప్పటికే 11 సార్లు వివాహం చేసుకున్న ఈ 52 ఏళ్ల మహిళ.. తాజాగా మరో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు చెప్పింది.
ఈ షోలో భాగంగా తనను తాను అబ్బాయిల పిచ్చిదానిగా వర్ణించుకుంది. తనకు రెండేళ్ల వయసులోనే మొదటి క్రష్ ఏర్పడిందని, అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉందని తెలిపింది. ‘నేను చాలా వేగంగా ప్రేమలో పడతాను. ఇప్పటిదాకా ఇరవై ఎనిమిది మందికి ప్రపోజ్ చేసి ఉంటాను. నా పెళ్లి ఎలా ఉంటుంది, భర్త ఎలా ఉంటాడనే ఎప్పుడూ ఊహిస్తుంటాను. నాకు తెలిసి నేను ప్రేమతోనే ప్రేమలో ఉన్నాను’ అని తన క్రేజీ లవ్ గురించి చెప్పుకొచ్చింది. రిలేషన్‌షిప్స్ వర్కవుట్ కాకపోతే.. కచ్చితంగా మన సినిమాకు సరిపోయే ‘మరొక నటుడిని కనుగొనాల్సిందే’ అని చెప్పింది. ఇప్పటికే మోనెట్‌కు చాలా మంది భర్తలు ఉండగా.. వాళ్లందరినీ ట్రాక్ చేయడంలో ఆమె కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు.
అయితే మోనెట్ ఇన్నిసార్లు పెళ్లి చేసుకునేందుకు మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. వివాహం చేసుకోకుండా సెక్స్ చేయడం తప్పు అనే క్రైస్తవ విశ్వాసాలను ఆమె బలంగా నమ్ముతుంది. ఈ క్రమంలోనే తన డేటింగ్ అనుభవాలను పంచుకుంది. ‘ఒక వ్యక్తితో కొన్ని నెలల పాటు డేటింగ్ చేశాక.. ఇద్దరి మధ్య సెక్సువల్ రిలేషన్ లేకపోతే, వెంటనే పెళ్లి చేసుకునేందుకు మొగ్గు చూపుతారు’ అని ఆమె న్యూయార్క్ పోస్ట్‌తో వివరించింది. ఇప్పటి వరకు 11 మ్యారేజ్ రిలేషన్స్‌లో ఒక బంధం ఆరు వారాలకే ముగియగా.. గరిష్టంగా ఒకరితో మాత్రం 10 ఏళ్లు కాపురం చేసింది. అయితే ఇప్పటికీ ఆమె తన ప్రేమాన్వేషణను వదులుకోకపోవడం విశేషం. 57 ఏళ్ల వయసులో రెండుసార్లు విడాకులు తీసుకున్న జాన్ అనే వ్యక్తితో మరోసారి పెళ్లికి సిద్ధమౌతోంది. కనీసం ఈసారైనా ఆమె అదృష్టం ఫలిస్తుందేమో చూడాలి.
Can you name all of your sister's ex-husbands?
Marcie: …. 😂 #AddictedToMarriage pic.twitter.com/RLI26GAcpH— TLC Network (@TLC) November 17, 2021