- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళిత బంధు.. మోసపూరిత పథకం.. మంద కృష్ణ మాదిగ, అద్దంకి దయాకర్ హెచ్చరిక
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/ మహబూబ్ నగర్: మోసాలు….. నయవంచనలతో ఈ ఏడేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను దగా చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. గురువారం మహబూబ్ నగర్ కేంద్రంలోని అంబేద్కర్ కళా భవన్ లో నిర్వహించిన దళిత సమగ్ర అభివృద్ధి సాధన ఈ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో మాదిగలు చేసిన పోరాటాలు, త్యాగాలను మరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ వచ్చిన వెంటనే దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నాడు.. భూమిలేని వారికి మూడు ఎకరాల భూమి ఇస్తానన్నాడు. ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యత ఇస్తానని మధ్య పెట్టాడు అని ఆరోపించారు. ఇప్పుడు దళిత బంధు పథకం దళితుల బాబు కోసం ప్రవేశపెట్టిన పథకం కాదు. ఇది ముమ్మాటికి మోసపూరిత పథకమే.. వచ్చే హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ పథకాన్ని తెచ్చారన్నారు. హైదరాబాద్ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తానని చెప్పి అర్ధాంతరంగా ఆపేశాడు. అలాంటిది ఒక్కో కుటుంబానికి దళిత బంధు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తారని నా నమ్మకం ఎంత మాత్రం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే హుజురాబాద్ లో, వంద రోజుల్లో రాష్ట్రంలోని 118 అసెంబ్లీ నియోజకవర్గాలలో అమలు చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా దళితులను చైతన్యవంతం చేసేందుకు దళిత సంఘాలు కూడా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ నెల 9న ఆయా జిల్లా కేంద్రాల వద్ద కలెక్టరేట్ ముందు దళిత గర్జన, 10 నుండి 15 వరకు జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలలో మహాధర్నా, 16 నుండి సెప్టెంబర్ 4 వరకు పాదయాత్రలు నిర్వహిస్తామని మందకృష్ణ మాదిగ చెప్పారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ దళితులందరూ ఏకం కావడం అగ్రవర్ణాలకు మింగుడు పడడం లేదని ఆరోపించారు. రాజకీయంగా దళితులను వాడుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ లలిత బంధు పథకాన్ని తెరపైకి తెచ్చారన్నారు. వాసాలమర్రి లో దళితులకు దళిత బందు పథకాన్ని అమలు చేయడం సంతోషకరం. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి అన్నారు. దళిత బంధువు ఆగిన క్షణం నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. రానున్న రోజులలో దళితుల అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు ఇచ్చిన హామీలను అమలు పరిచేందుకు వీలుగా ఉద్యమాలు చేపడతామని చెప్పారు. కోవర్టుల కు, తెలంగాణ ద్రోహులకు పదవులను ఇస్తూ నిజమైన ఉద్యమకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన పెట్టారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కావలి కృష్ణయ్య, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, అధికార ప్రతినిధి బ్యాగరి వెంకటస్వామి, దళిత ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి శంకర్, నేతలు బహదూర్ శ్రీని వాసు , గోమాస శ్రీనివాస్, ఓయూ జేఏసీ నాయకులు దుర్గం భాస్కర్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.