ముంబై విమానాశ్రయంలో అదానీ సంస్థకు భారీ వాటాలు 

by Harish |
ముంబై విమానాశ్రయంలో అదానీ సంస్థకు భారీ వాటాలు 
X

దిశ, వెబ్‌డెస్క్: పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్వహణ లీజును దక్కించుకున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ.. త్వరలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా వాటాలను సొంతం చేసుకోనుంది. ముంబై విమానాశ్రయంలో సుమారు 74 శాతం వాటాను దక్కించుకోవడం ద్వారా దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయాల ఆపరేటర్‌గా ఉన్న జీఎంఆర్ తర్వాత అదానీ సంస్థ నిలవనుంది.

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో జీవీకే గ్రూపునకు చెందిన 50.5 శాతం వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించి స్పష్టమైన వివరాలను ఈ వారాంతంలోగా వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. ఇది కాకుండా, బిడ్‌నెస్ట్‌కు చెందిన 13.5 శాతం, ఏసీఎస్ఏకు చెందిన 10 శాతం వాటాలు.. మొత్తం 23.5 శాతాన్ని కొనుగోలు చేయనుంది. ఈ వాటాల కోసం అదానీ గ్రూప్ రూ. 15 వేల కోట్లను చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ కొనుగోలు ప్రక్రియ అనంతరం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ, బ్రాండింగ్ అదానీ సంస్థకు చెందుతుంది.

Advertisement

Next Story

Most Viewed