నెల్లూరులో ఫిషింగ్ హార్బర్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు: పార్లమెంట్ లో ఎంపీ

by srinivas |   ( Updated:2020-03-17 06:53:07.0  )
నెల్లూరులో ఫిషింగ్ హార్బర్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు: పార్లమెంట్ లో ఎంపీ
X

నెల్లూరు జిల్లా కేంద్రానికి సమీపంలోని జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్‌ను ఎప్పుడు ఏర్పాటు చేస్తారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లోక్ సభలోని ప్రశ్నోత్తరాల సమయంలో జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు ప్రతిపాదన ఏళ్లుగా నలుగుతోందని, ప్రాజెక్టు ఏర్పాటుకు అడ్డంకులు ఏమిటి?, ఎందుకు ఆలస్యమవుతోంది? ప్రాజెక్టు ఏర్పాటుకు ఏ మేరకు నిధులు కేటాయించారు? అంటూ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి కేంద్ర మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి లిఖతపూర్వక సమాధానమిస్తూ, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిందని అన్నారు. ఈ నివేదికలో ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక అంశాలను కూడా పేర్కొన్నారని ఆయన తెలిపారు. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు 288.80 కోట్ల రూపాయలు అవసరం కాగా, కేంద్ర ప్రభుత్వ వాటాగా 144 . 40 కోట్ల రూపాయలను కోరిందని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు నాలుగేళ్ల సమయం పడుతుందని ఆయన తెలిపారు.

tags : juvvaladinne, juvvaladinne fishing harbour,mp adala, adala prabhakar reddy, parliament, loksabha

Advertisement

Next Story

Most Viewed