- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదా కొత్త చిత్రం.. ఏమై ఉంటుందోయి?
హార్ట్ ఎటాక్, క్షణం, గరుడ వేగ సినిమాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు పొందిన ఆదా శర్మ.. ఆ తర్వాత బాలీవుడ్, వెబ్ సిరీస్‌లతో బిజీ అయిపోయింది. సోషల్ మీడియాలో వెరైటీ పోస్ట్‌ల ద్వారా ఎప్పుడూ ఎంటర్‌టైన్మెంట్ అందిస్తూ అభిమానులకు దగ్గరుండే ఈ భామ.. తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించింది. చాలా కాలం తర్వాత మరో తెలుగు సినిమాకు సైన్ చేసినట్లు చెప్పింది.
సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించిన ఆదా.. ఈ సినిమాలో హీరో ‘స్క్రిప్ట్’ అని చెప్తోంది. అంటే తను లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నట్లు ఇన్‌డైరెక్ట్‌గా తెలిపింది. ఇందులో స్పైడర్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పింది. అంతేకాదు ఈ సినిమా టైటిల్ గురించి హింట్ ఇచ్చానని.. గెస్ చేయమని చెప్తోంది భామ. దీంతో ఈ పనిలో పడిపోయిన అభిమానులు.. ఆదా కొత్త చిత్రం టైటిల్ ఏమై ఉంటుందా? అనే ఆలోచనలో పడ్డారు. ఈ మేరకు టైటిల్ గెస్ చేయడంలో బిజీ అయిపోయారు. మీరు కూడా ఓసారి ఆదా పోస్ట్ చూసి ఆ సినిమా టైటిల్ ఏంటో కనుక్కోండి మరి.
https://www.instagram.com/p/CDB3ZNln24a/?igshid=16e6fzpn5mzmi