ఆయనతో ప్రాణహానీ ఉంది: సినీనటి శ్రీసుధ

by Sumithra |   ( Updated:2021-01-23 01:25:18.0  )
ఆయనతో ప్రాణహానీ ఉంది: సినీనటి శ్రీసుధ
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ నటి శ్రీసుధ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. సినిమాటోగ్రాఫర్ శ్యామ్‌ కె నాయుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఐదేళ్లు కలిసి ఉన్నాక మోసం చేశాడంటూ గతేడాది ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తాను రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించినా పోలీసులు ఇంతవరకు ఆయన్ను అరెస్ట్ చేయలేదని శుక్రవారం ఎస్సార్‌‌నగర్ పోలీసులకు ఆమె మళ్లీ ఫిర్యాదు చేశారు. గతేడాది ఆగస్టు 5న, సినీ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, స్టిల్ ఫొటోగ్రాఫర్ సాయిరాం మాగంటిలు.. శ్యామ్‌కెనాయుడిపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని దూషించి, శారీరకంగా దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అందుకే అప్పటి నుంచి నేను బయటకు రాలేదని, శ్యామ్‌కెనాయుడు స్నేహితులతో తనకు ప్రాణ హానీ ఉందని ఆమె వెల్లడించారు.

Advertisement

Next Story