డ్రగ్స్ కేసులో నటి రియా చక్రవర్తి అరెస్ట్

by Anukaran |   ( Updated:2020-09-08 05:38:10.0  )
డ్రగ్స్ కేసులో నటి రియా చక్రవర్తి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్:

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. డ్రగ్ డీలర్స్‌తో సంబంధం ఉందని తేలడంతో మంగళవారం తనను అదుపులోకి తీసుకున్నారు. ‘కేదార్ నాథ్’ షూటింగ్ సమయంలో సుశాంత్ సింగ్ కోసమే తాను డ్రగ్స్ కొనుగోలు చేశానని స్వయంగా అంగీకరించడంతో అధికారులు అరెస్ట్ చేశారు.

ఇప్పటికే రియా సోదరుడు, సుశాంత్ మాజీ మేనేజర్‌ను అరెస్ట్ చేసిన అధికారులు.. మూడు రోజుల విచారణ తర్వాత రియాను అదుపులోకి తీసుకున్నారు. కేవలం గంజాయి మాత్రమే కాకుండా ఇతర డ్రగ్ కెమికల్స్ కూడా కొనుగోలు చేశామని రియా అంగీకరించడంతో పాటు బాలీవుడ్‌కు చెందిన దాదాపు 25 మందికి డ్రగ్ లీడర్స్‌తో లింక్ ఉందని రియా వివరాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో వారు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.

కాగా, సీబీఐ.. రియా చాట్ బహిర్గతం చేసిన తర్వాత రంగంలోకి దిగిన ఎన్సీబీ డ్రగ్ మాఫియాతో బాలీవుడ్ సంబంధాలను బయటపెట్టేందుకు ట్రై చేస్తోంది.

Advertisement

Next Story