నేడు నటి నవాబ్‌బానూ అంత్యక్రియలు

by Shamantha N |   ( Updated:2020-03-26 01:32:19.0  )
నేడు నటి నవాబ్‌బానూ అంత్యక్రియలు
X

అలనాటి అందాల నటి నవాబ్ బానూ(నిమ్మి) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. నేడు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించునున్నట్టు బంధువులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు 87ఏండ్లు. 1950, 60 దశకంలో పలు చిత్రాల్లో నటించిన ఆమె మంచి గుర్తింపు పొందారు. 1949 రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన బర్సాత్ సినిమాతో నిమ్మి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. నిమ్మి.. రాజ్ కపూర్, ఆనంద్, దిలీప్ కుమార్ వంటి స్టార్లతో కలిసి పనిచేశారు. ప్రముఖ రైటర్ అలీ రాజాని వివాహం చేసుకున్నారు. ఆయన 2007లో కన్నుమూశారు.

Tags: Actress Nawab’s funeral today,Died of a heart attack,Beauty star of yesteryear

Advertisement

Next Story

Most Viewed