పురుషాధిక్యత వల్లే ‘గాంధీ’ జాతిపిత అయ్యారు.. నటి షాకింగ్ కామెంట్స్

by Shamantha N |   ( Updated:2021-03-12 20:16:41.0  )
పురుషాధిక్యత వల్లే ‘గాంధీ’ జాతిపిత అయ్యారు.. నటి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. ఫైర్ బ్రాండ్ కంగనా.. ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంటుంది. తాజాగా ఆమె.. ఏకంగా జాతి పిత మహత్మా గాంధీనే విమర్శిస్తూ ట్విట్టర్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘ మహాత్మా గాంధీ తన భార్య, పిల్లలను వేధించినట్టు ఆరోపణలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. గాంధీ తన సొంత బిడ్డలను వేధించి చెడ్డ తండ్రిగా పేరుతెచ్చుకున్నారు అని చెప్పుకొచ్చింది. తన భార్య.. అతిథుల మరుగుదొడ్లు శుభ్రం చేయలేదని ఆమెను ఇంటి నుండి బయటకు నెట్టివేసినట్టు పలు ప్రస్తావనలు ఉన్నాయని తెలిపింది. అయిన్పటికీ గాంధీజీ.. భారత జాతిపిత అయ్యారు. ఆయన మంచి భర్త, తండ్రి కాకపోయినా ఓ గొప్ప నాయకుడు అయ్యారు. అది కేవలం పురుషాధిక్యత వల్లే సాధ్యమైంది’ అని కంగనా ట్విట్టర్ లో పేర్కొంది. గాంధీపై ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రముఖులు, నెటిజన్లు కంగనాపై మండిపడుతున్నారు. కంగనా మితిమీరి ప్రవర్తిస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story