వరంగల్‌లో సందడి చేసిన నటి కాజల్.. వీడియో

by Shyam |   ( Updated:2021-08-13 06:49:59.0  )
వరంగల్‌లో సందడి చేసిన నటి కాజల్.. వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్ : నటి కాజల్ వరంగల్‌ జిల్లాలో సందడి చేశారు. తన భర్తతో కలిసి వరంగల్ వెళ్లిన కాజల్.. నగరంలో ఓ వస్త్రాలయాన్ని ప్రారంభించారు. భర్త గౌతమ్‌తో కలిసి జ్యోతి వెలిగించిన కాజల్ షాపింగ్​మాల్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వస్త్రాలయంలో విభిన్న రకాల చీరలను ప్రదర్శిస్తూ.. ఫొటోలకు ఫోజులిచ్చారు. కాజల్ జిల్లాకు వస్తున్నారన్న సంచారం బయటకు రావడంతో ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు తరలివచ్చారు. అభిమానులు ఆమెతో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో నటి కాజల్ తెలుగులో మాట్లాడి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. తనపై ఎంతో ప్రేమ చూపిస్తున్న వరంగల్ వాసులకు, అభిమానులకు కాజల్, ఆమె భర్త కృతజ్ఞతలు తెలిపారు.

https://twitter.com/AndhraKajalFC/status/1426114598789214211?s=20

Advertisement

Next Story

Most Viewed