మెగాస్టార్ చిరు సినిమాలో జెనీలియా??

by Anukaran |   ( Updated:2020-08-05 05:44:34.0  )
మెగాస్టార్ చిరు సినిమాలో జెనీలియా??
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా నిలిచింది జెనీలియా డిసౌజా దేశ్ ముఖ్. బాయ్స్ మూవీతో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ సినిమాలో పొట్టి పొట్టి బట్టలతో, మత్తెక్కించే కళ్ళతో కుర్రకారుని ఉర్రుతలూగించింది. ఈరోజు జెనీలియా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు బాలీవుడ్ లోను, టాలీవుడ్ లోనూ చక్కర్లు కొడుతోంది.

జెనీలియా తాను నటించిన తొలి హిందీ మూవీ “తుజే మేరీ కసమ్” హీరో రితేష్ దేశ్ముఖ్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. వారి ఇద్దరి పిల్లలను చూసుకుంటూ ఇన్నాళ్లు జెనీలియా ఇంటికే పరిమితం అయింది. తాజాగా ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి నటిస్తోన్న “లూసీఫర్”మూవీ లో జెనీలియా యాక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో ముఖ్య పాత్రలో నటించనున్నట్టు సమాచారం.

జెనీలియా మొదటి తెలుగు సినిమా సుమంత్ హీరోగా తెరకెక్కిన సత్యం. రెడీ, ఢీ వంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ “బొమ్మరిల్లు”లో చేసిన హాసిని పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పటివరకు ఐరన్ లెగ్ అనే ముద్రతో అనేక అవకాశాలు కోల్పోయినా బొమ్మరిల్లు సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. సినిమాల్లో నటిస్తుండగానే బాలీవుడ్ హీరో, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ కుమారుడు రితేష్ దేశ్ ముఖ్ ను వివాహమాడి గృహిణిగా మారింది జెనీలియా డిసౌజా దేశ్ ముఖ్.

Advertisement

Next Story

Most Viewed