- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్నారుల కోసం.. సందీప్ కిషన్ సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకూ వైరస్ బారినపడి సామాన్యులతో పాటు ప్రముఖులూ అనేకమంది మృత్యువాతపడుతున్నారు. ఈ విపత్కర సమయంలో ఒకరికొకరం సాయంగా ఉండాలంటూ సెలబ్రిటీలు ప్రజలలో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేశ్ సైతం ప్రాణాల కోసం పోరాడుతున్న వారికి ప్లాస్మా దానం చేయాలని ప్రజలకు, అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజాగా.. కరోనా విస్తరిస్తున్న ఈ కఠిన పరిస్థితుల్లో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహమ్మారి బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు అండగా నిలువాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా కారణంగా చిన్నారులేవరైనా తల్లిదండ్రులను కోల్పోతే వారి బాధ్యతను తాను తీసుకుంటాయని హీరో సందీప్ ముందుకొచ్చి మానవత్వం చూపించారు. అంతేగాకుండా.. అలాంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే తనను కాంటాక్ట్ కావాలని ఓ మెయిల్ ఐడీని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.[email protected]కు సమాచారం అందించాలని అభిమాలను కోరారు.
Please Pass on the word..
Love you All ❤️
SK pic.twitter.com/tsgRsgJtSz— Sundeep Kishan (@sundeepkishan) May 3, 2021