- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమలలో సినీ నటుడు.. ఏం కోరుకున్నాడో తెలుసా ?
దిశ, ఏపీ బ్యూరో: ప్రపంచంలో కరోనా మహమ్మారి అంతం కావాలని, త్వరలో థీయేటర్లు ప్రారంభమై అందరూ సినిమాలు వీక్షించే అవకాశం కలిగించాలని తిరుమల శ్రీవారిని వేడుకున్నట్లు సినీనటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆదివారం వీఐపీ విరామ సమయంలో రాజేంద్రప్రసాద్ శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఏడాది పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకోలేక పోయానని.. ఆలస్యంగానైనా ఆదివారం దర్శించుకున్నట్లు తెలిపారు.
సుందరకాండ పారాయణం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు సుందరకాండ పారాయణంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నటకిరీటి రాజేంద్రప్రసాద్ సూచించారు. మరోవైపు హీరో మంచు విష్ణు సైతం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్ఛకులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.