జయప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి

by Anukaran |   ( Updated:2020-09-08 08:03:08.0  )
జయప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం గుంటూరులోని ఆయన స్వగ్రామం కొరిటెపాడు శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. అంత్యక్రియల్లో బంధువులతో పాటు, సీని ప్రముఖులు, భారీగా అభిమానులు కూడా హాజరయ్యారు. కాగా ఆయన మృతి పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story