నటుడు జయప్రకాశ్ రెడ్డి ఇకలేరు..

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. కరోనా నేపథ్యంలో సినిమా షూటింగులు ఆగిపోవడంతో గుంటూరులో ఉంటున్న ఆయన.. మంగళవారం తెల్లవారు జామున గుండెపోటుతో బాత్‌రూంలో కుప్పకూలిపోలినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. మొదట్లో రాయలసీమ స్లాంగ్ విలనిజంలో ఎక్కువ పాత్రలు పోషించిన ఆయన క్రమంగా కామెడీ రోల్స్‌లో కూడా నటిస్తూ తనెంటో నిరూపించుకున్నాడు.

తన నటన ప్రావీణ్యంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన లేరన్న వార్తతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. జయప్రకాశ్ రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్ల మండలం సిరివెళ్ల గ్రామానికి చెందిన వాడు. బ్రహ్మపుత్రుడుతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. పలు నాటకాల్లోనూ ఆయన నటించారు.సినిమాల్లోకి రాకముందు ఆకయన ఎస్సై‌గా కూడా పని చేశారు.

కమెడియన్‌గా, విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జయప్రకాష్ రెడ్డికి ప్రేమించుకుందాం రా సినిమా మంచి గుర్తింపుని తీసుకొచ్చి ఆయన లైఫ్ ని టర్నింగ్ తిప్పింది.నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, విజయరామరాజు, జయం మనదేరా, చెన్నకేశవ రెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య, ఛత్రపతి, బిందాస్, గబ్బర్‌సింగ్‌, నాయక్‌, బాద్షా, రేసుగుర్రం, మనం, రెడీ, పటాస్, టెంపర్‌, సరైనోడు వంటి హిట్ చిత్రాల్లో నటించిన జయప్రకాష్ రెడ్డి.. చివరిసారిగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరులో కనిపించారు.

Advertisement