- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ కులమే ఛాన్స్ ఇప్పించండన్న నెటిజన్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన నటుడు
దిశ, వెబ్డెస్క్: టాలీవుడ్ లో సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర ఏదైనా ఆయన జీవించేస్తాడు. కామెడీ, విలనిజం, సపోర్టింగ్ రోల్స్ ఏదైనా బ్రహ్మాజీ కి కొట్టిన పిండి. ఇక ఈయన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ ఉండే బ్రహ్మాజీ ఆయన పెట్టిన పోస్టులకు కామెంట్లు ఇచ్చేవారికి కూడా సమాధానాలు ఇస్తూ ఉంటారు. తాజాగా ఈ సీనియర్ నటుడికి సోషల్ మీడియాలో కుల ప్రశ్నలు ఎదురయ్యాయి. సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒకరు ఎదిగారు అంటే వాడు మా కులం వాడే అని జబ్బలు చరుచుకొనే వారు లేకపోలేదు. ఇక తాజాగా బ్రహ్మాజీ సోషల్ మీడియా అకౌంట్ లో ఒక వ్యక్తి తనను తాను పరిచయం చేసుకుంటూ.. “అన్నా నేను మన కమ్యూనిటీకి చెందిన వాడిని, సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం ఏ చిన్న ఛాన్సు ఉన్నా.. ఏదో పాత్రలో నటించే అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నా” అంటూ కులాభిమానాన్ని ప్రదర్శించాడు.
ఇక నెటిజన్ పోస్ట్ చూసిన బ్రహ్మాజీ ఒకింత ఆవేశానికి గురయ్యారు. నెటిజన్ కి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. కులం గురించి అతగాడు పెట్టిన పోస్టుకు స్పందిస్తూ.. “నేను ఇండియన్ ను.. తెలుగోడిని.. అదే నా కమ్యూనిటీ అంటూ బదులిచ్చారు. అవకాశం కావాలంటే నేరుగా అడగాలే కానీ ఇలా కులం.. గిలం ఏంట్రా” అంటూ గట్టిగా బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ లు నెట్టింట వైరల్ గా మారాయి. బ్రహ్మాజీ మంచి సమాధానం ఇచ్చాడు అంటూ నెటిజన్లు ఆయనను పొగిడేస్తున్నారు.
Follow Disha-Telugu newspaper Official Facebook page