యాక్షన్ కింగ్ కూతురికి కరోనా పాజిటివ్

by Shamantha N |
యాక్షన్ కింగ్ కూతురికి కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవతూ, విలయతాండవం చేస్తోంది. సెటబ్రిటీలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా ఎవరినీ వదలకుండా అందరినీ కరోనా ఓ పట్టు పడుతోంది. తాజాగా తెలుగులో ఒకే ఒక్కడు, భారతీయుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తానే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనతో కాంటాక్ట్ అయిన వారు కూడా కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా సోకటంతో ఆమె ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటున్నానని తెలిపారు. డాక్టర్ల సలహాతో మందులు తీసుకుంటున్నానని త్వరలో మంచి ఆరోగ్యంతో ముందుకొస్తానని అన్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed