- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసులే నిజమైన హీరోలు: అనుష్క శెట్టి
దిశ, క్రైమ్ బ్యూరో : దేశ భద్రత, సామాజిక భద్రత రక్షణలో పోలీసుల పాత్ర చాలా కీలకమైందని ప్రముఖ సినీ నటీ అనుష్క అన్నారు. సమాజాన్ని వెన్నంటి ఉండి నిరంతరం ప్రజలు ప్రశాంతంగా జీవించేలా కృషి చేస్తున్న పోలీసులే నిజమైన హీరోలు అని ఆమె కొనియాడారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల తొలి వార్షికోత్సవ సమావేశం జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్‌లో బుధవారం జరిగింది. కార్యక్రమానికి ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ డీసీపీ అనసూయ అధ్యక్షతన నిర్వహించిగా… ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటీ అనుష్క, ఉమెన్ సేఫ్టీ విభాగం అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ లు హజరయ్యారు.
ఈ సందర్భంగా సినీ నటీ అనుష్క మాట్లాడుతూ…. ‘సినిమాలో నటిస్తున్నందుకు ప్రజలు మమ్ముల్ని స్టార్స్ అంటున్నారు. కానీ, మేమంతా ప్రశాంతంగా ఉండడానికి మా వెనుక మీ త్యాగం ఉంది. వెండితెరపై నటించే మాకంటే.. మీరే నిజమైన రియల్ హీరోలని అన్నారు. పోలీసులు లేకుండా ప్రజలు సురక్షితమైన జీవితాన్ని ఊహించుకోలేరని అన్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలను చేపట్టినా.. మహిళల్లో కూడా చైతన్య స్థాయిని పెంచుకోవాలన్నారు.