బీ కేర్ ఫుల్.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే అంతే సంగతులు

by Sumithra |
బీ కేర్ ఫుల్.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే అంతే సంగతులు
X

దిశ, భద్రాచలం టౌన్ : వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కలిగి.. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని భద్రాచలం ట్రాఫిక్ SI శ్రీపతి తిరుపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ ఒక్క వాహనదారుడు సంబంధించిన అన్ని వాహన అనుమతి పత్రాలు కలిగి ఉండాలని.. తనిఖీల్లో భౌతికంగా చూపాలని కుదరని పక్షంలో మొబైల్ ఫోన్‌లో నైనా చూపించాల్సి ఉంటుందని తెలిపారు. దీనికితోడు వాహనంపై ఉన్న పెండింగ్ చలానాలు ఎప్పటికప్పుడు పరిశీలించుకొని సకాలంలో చెల్లించాలని లేనిచో.. మోటారు వెహికల్ చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలన్నారు.

Advertisement

Next Story