- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులు.. గంటన్నరకుపైగా బాత్‌రూమ్‌లో చీఫ్ ఇంజనీర్
దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ జెన్‌కోలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల అంశం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ మహిళా ఉద్యోగిని జేఏఓ స్థాయి అధికారి లైంగికంగా వేధించడం.. ఆ వేధింపులు భరించలేని సదరు మహిళా చీఫ్ ఇంజనీరుకు ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన జేఏఓ స్థాయి అధికారిపై చర్యలు తీసుకోవాల్సిన చీఫ్ ఇంజనీర్.. మహిళా ఉద్యోగితో కాంప్రమైజ్ చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు గుప్పుమంటోన్న సంగతి తెలిసిందే. అయితే కాంప్రమైజ్ చేసేందుకు చీఫ్ ఇంజనీర్‌తో ఓ యూనియన్‌కు చెందిన పలువురు నాయకులు ఉన్నారు. దీంతో ఆ యూనియన్‌లోని మహిళా ఉద్యోగులంతా ఆ యూనియన్‌కు రాజీనామా చేస్తుండడం జెన్‌కోలో చర్చనీయాంశమయ్యింది. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడిన జేఏఓ స్థాయి తీరును వ్యతిరేకించకుండా యూనియన్ నాయకులు ఆయనకు సపోర్టు చేయడం ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఇదిలావుంటే.. లైంగిక వేధింపులకు పాల్పడిన జేఏఓ స్థాయి ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించేందుకు వెళితే.. గంటన్నరకు పైగా చీఫ్ ఇంజనీరు బాత్‌రూమ్‌లో దాక్కోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది అంతుచిక్కలేదు.
పదుల సంఖ్యలో మహిళా ఉద్యోగుల రాజీనామాలు..
బాధిత మహిళా ఉద్యోగినికి బాసటగా నిలవకుండా వక్రబుద్ధితో కాంప్రమైజ్‌కు ప్రయత్నించిన యూనియన్ నాయకులపై యూనియన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి నిరసనగా ఆ యూనియన్‌లోని మహిళా నాయకులంతా ఒక్కొక్కరుగా యూనియన్ నాయకుల తీరును ఖండిస్తూ రాజీనామాలు చేయడం ఉద్యోగుల్లో కలకలం రేపింది. దీంతో యూనియన్ ఆదేశాల మేరకు కాంప్రమైజ్‌కు ప్రయత్నించిన ఉద్యోగులు తమంతట తామే సదరు యూనియన్‌కు రాజీనామా చేశారు. దీంతో మహిళా ఉద్యోగులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం గమనార్హం.
నిజంగా వేటు పడేనా..?
జెన్‌కోలో మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన జేఏఓ స్థాయి అధికారిని చీఫ్ ఇంజనీర్ వెనకేసుకొచ్చారనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విజిలెన్స్ వర్గాలు సైతం పూర్తిస్థాయిలో విచారణ చేశాయి. అయితే ఈ విచారణలో జేఏఓ అధికారి లైంగిక వేధింపులు నిజమేనని తెలుస్తోంది. అంతే కాకుండా యూనియన్ నాయకులతో కలిసి మహిళా ఉద్యోగిని కాంప్రమైజ్ చేసేందుకు చీఫ్ ఇంజనీర్ ప్రయత్నించారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో లైంగిక వేధింపులకు పాల్పడిన జేఏఓ స్థాయి అధికారితో పాటు చీఫ్ ఇంజనీర్ పైనా చర్యలు తీసుకోవాలని మహిళా ఉద్యోగుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. విజిలెన్స్ ఎస్పీ విచారణ నివేదికను జెన్‌కో సీఎండీకి అందించనున్నారు. దీని ఆధారంగా జేఏఓతో పాటు చీఫ్ ఇంజనీర్‌పై చర్యలు తీసుకుంటారా..? లేదా.. అన్నది వేచిచూడాల్సిందే.