హజురాబాద్‌లో స్పెషల్ ఆఫీసర్లు.. అందుకేనా?

by Sridhar Babu |   ( Updated:2021-06-17 05:02:01.0  )
huzurabad-name 1
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న హుజురాబాద్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు పోలీసు అధికారులు కూడా ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్నారు. వీరంతా టీఆర్ఎస్ పార్టీ కోసం కాదని, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కోసమని చెప్తున్నారు. అయితే, ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలోనే స్పెషల్ ఆఫీసర్లను నియమించడమే పెద్ద చర్చకు దారి తీసింది. హుజురాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక మండలాలకు నలుగురు ఏసీపీలను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం.

వీరితో పాటు ఒక్కో మండలానికి ఐదుగురు సీఐలు, 10 మంది వరకూ ఎస్సైలను నియమించినట్టు సమాచారం. ఇప్పటికే ఆయా చోట్ల లా అండ్ ఆర్డర్ కోసం పోలీసులు పని చేస్తుండగా.. అదనంగా వీరిని నియమించడం గమనార్హం. ఓ వైపున రాజకీయ నాయకుల టూర్లు, మరోవైపు పోలీసు అధికారుల కార్యకలాపాలతో హుజురాబాద్ నియోజకవర్గంలో సందడి వాతావరణం నెలకొంది. కాగా, ఎన్నికల్లో ఎలాగైనా గెలించేందుకు టీఆర్ఎస్ పార్టీ పోలీసుల సాయం తీసుకుంటోందని బీజేపీ, ఈటల వర్గీయులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed