ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి: ఏసీపీ ఫణీందర్

by Shyam |   ( Updated:2021-11-30 06:44:42.0  )
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి: ఏసీపీ ఫణీందర్
X

దిశ, నర్సంపేట టౌన్: ప్రజల్లో అవగాహన లోపం వల్ల ఆపదలో ఉన్న వారికి సమయానికి రక్తం అందక ఇబ్బందులు పడుతున్నారని ఏసీపీ ఫణిందర్ అన్నారు. పట్టణంలోని బస్ స్టేషన్ లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా ఏసీపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని సమయాల్లో ఆర్టీసి కార్మికులు అందుబాటులో ఉంటూ ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు.

ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత రక్త దానంలో ముందుండాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరంలో 80సార్లు రక్త దానం చేసిన ఆర్టీసి బస్సు డ్రైవర్ దంతాల శ్రీనాథ్ ను శాలువా కప్పి సత్కరించారు. రక్తదాన శిబిరాన్ని ఆయన చేత్తోనే ప్రారంభం చేయించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాస రావు, ఏసీపీ కరుణ సాగర్ రెడ్డి, ఐఎంఎ అధ్యక్షుడు లెక్కల విద్యాసాగర్ రెడ్డి, డాక్టర్ నవత, నాడెం శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed