కరోనాపై సుమక్క సూచనలు

by sudharani |   ( Updated:2020-03-16 10:50:49.0  )
కరోనాపై సుమక్క సూచనలు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు ఆ వైరస్ దరి చేరకుండా ఉండటం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే యాంకర్ సుమ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. కరోనా వైరస్ గురించి తానెలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో వీడియోలో వివరించారు. చేతులు శుభ్రంగా ఉండేందుకు ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్‌ను వినియోగిస్తున్నాని తెలిపారు. ఒకవేళ శానిటైజర్ అందుబాటులో లేకపోతే సబ్బుతో 20 నుంచి 30 సెకన్ల పాటు చేతిని శుభ్రం చేసుకుంటున్నానని చెప్పారు. కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవరసం లేదన్న సుమక్క.. కానీ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. వీలైనంత వరకు మాస్క్‌లు వాడాలని.. చేతులను ఎక్కువగా ముఖానికి టచ్ చేయకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఒకవేళ దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వెళ్లి డాక్టర్‌ను సంప్రదించాలని సూచించింది. అలాంటి వాళ్లు మన పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లైతే ఇదే సలహా ఇచ్చి… వారికి కొంచెం దూరంగా ఉండాలన్నారు. అలాగే ఎవరైనా కలిసినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాలని… హగ్గులు, షేక్ హ్యాండ్ లాంటివి వీలైనంత వరకు మానుకోవాలన్నారు. జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు సుమక్క.


tags : CoronaVirus, Covid19, Suma, Acnhor Suma

Advertisement

Next Story

Most Viewed