మెగా అభిమానులకు ‘చిరు’ కానుక

by srinivas |
మెగా అభిమానులకు ‘చిరు’ కానుక
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగాస్టర్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులకు ‘చిరు’ కానుక అందించారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న 152 మూవీ ‘ఆచార్య’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ మూవీని రామ్ చరణ్, మాట్నీ మూవీస్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

కాగా, శనివారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ మూవీకి చెందిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను కాసేపటి కిందట సినిమా చిత్ర బృందం ట్విట్టర్‌లో విడుదల చేసింది. ఇందులో ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తిగా చిరంజీవి కనిపిస్తున్నారు. ధర్మస్థలి అనే ఊరివాళ్ల కోసం చిరు కత్తిని చేతపట్టి పోరాడుతున్నట్లుగా ఈ పోస్టర్‌లో కనిపిస్తోంది.దీనిపై ఇప్పటికే చిరు ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Advertisement

Next Story