అధికారులపై కేసు నమోదు.. కోర్టు ఏం చెప్పిందంటే..?

by Shyam |   ( Updated:2021-07-29 05:24:13.0  )
అధికారులపై కేసు నమోదు.. కోర్టు ఏం చెప్పిందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: అధికారులు తప్పుడు కేసు పెట్టారని ఒక బాధితుడు కోర్టు మెట్లక్కాడు. గత సంవత్సరం జూలై 29 న అచ్చంపేట కు చెందిన ఒక వ్యక్తి తన కారులో నల్లబెల్లం,పటిక అక్రమ రవాణా చేస్తున్నాడని అచ్చంపేట నందు ఆబ్కారీ మరియు మరియు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అనుమానించి అతనిపై తప్పుడు కేసు నమోదు చేశారు. బాధితుడు తనకేం తెలియదని ఎంత చెప్పినా వినలేదు. దీంతో బాధితుడు తప్పుడు కేసు నమోదు చేసిన అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనీ అచ్చంపేట న్యాయస్థానంలో కోరాడు. ఈ కేసు ను విచారించిన కోర్టు తప్పు చేస్తే అధికారులకైనా శిక్ష తప్పదని, నిందితులైన అచ్చంపేట ఆబ్కారీ సిఐ అనంతయ్య, ఆబ్కారీ ఎన్ ఫోర్స్ మెంట్ సూపరింటెండెంట్ అంజి రెడ్డి,ఎన్ఫోర్స్ మెంట్ ఎస్ఐ నిజాముద్దీన్, ఎస్ఐ ప్రదీప్ కుమార్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేయవలసిందిగా సంబంధిత పోలీసు శాఖను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed