తప్పుడు కేసు నమోదు.. అధికారులకు షాకిచ్చిన న్యాయస్థానం

by Sumithra |   ( Updated:2021-07-29 03:35:26.0  )
Achanpeta court
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లబెల్లం అక్రమ రవాణా చేస్తున్నాడని, నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన ఎండీ తయారుదిన్‌పై అచ్చంపేట పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారు. నల్లబెల్లం రవాణాతో తనకు ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పినా.. పోలీసులు వినిపించుకోలేదు. దీంతో చేసేదేంలేక బాధితుడు పక్కా సాక్ష్యాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. వివరాళ్లోకి వెళితే.. గతేడాది జులై 29న అచ్చంపేట ఆబ్కారీ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కారులో నల్లబెల్లం తరలిస్తున్నాడని కేసు నమోదు చేశారు. దీంతో తానేం తరలించడం లేదని ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో చేసేందేంలేక పక్కా సాక్ష్యాధారాలతో బాధితుడు అచ్చంపేట కోర్టును ఆశ్రయించాడు. కోర్టు వారిని అచ్చంపేట ఆబ్కారీ సీఐ అనంతయ్య, ఆబ్కారీ ఎన్ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి, హైదరాబాద్ ఎన్ఫోర్స్‌మెంట్ ఎస్ఐ నిజాముద్దీన్, అచ్చంపేట ఎస్ఐ ప్రదీప్ కుమార్ తప్పుడు కేసు నమోదు చేశారని నిర్ధారించింది. సంబంధిత పోలీసు అధికారులపై కేసు నమోదు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది.

Advertisement

Next Story