- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒంటరి మహిళలే టార్గెట్..!
దిశ, హుస్నాబాద్:
అమాయకులు, ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ పెన్షన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లను ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడిని సిద్దిపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసీపీ సందెపోగు మహేందర్ మాట్లాడుతూ.. సిద్దిపేటకు చెందిన దండ్ల శ్రీనివాస్, అల్లెపు కృష్ణ అనే వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి.. అమాయకులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసేవారని తెలిపారు.
తాజాగా నాగారం గ్రామానికి చెందిన సంఘ మల్లయ్యకు పెన్షన్ రూ. 3,500 వచ్చేలా చేస్తామని మాయమాటలు చెప్పి.. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోటోలతో పాటు రూ.4వేలు కావాలని అడిగారు. దీంతో వారికి రూ.2వేలు ఇచ్చిన మల్లయ్య.. తాను మోసపోయానని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. బుధవారం సాయంత్రం హుస్నాబాద్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ఓ వ్యక్తి పరుగులు పెట్టడంతో పోలీసులు పట్టుకుని విచారించామని తెలిపారు. గతంలో పోతారెడ్డిపేటలో మరో వ్యక్తి ద్వారా రూ.4,500 తీసుకున్నట్లు దండ్ల శ్రీనివాస్ ఒప్పుకున్నట్లు ఏసీపీ మహేందర్ తెలిపారు. మరో నిందితుడి అల్లెపు కృష్ణ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.