- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సికింద్రాబాద్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
దిశ, క్రైమ్ బ్యూరో: సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్ పరిధిలోని బంగారం షాపులో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించి నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, ఏసీపీ వినోద్ కుమార్, మార్కెట్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావుతో కలిసి సీపీ అంజనీకుమార్ ఆదివారం బషీర్‌బాగ్ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. నేమి చంద్ జైన్ జువెలరీస్ నగల దుకాణాన్ని ఈనెల 14న సాయంత్రం 4.30గంటలకు బంద్ చేసి సిబ్బంది వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం 11గంటలకు షాపు సిబ్బంది సునీల్ వచ్చి చూడగా చోరీ జరిగిట్లు గుర్తించాడు. వెంటనే యజమానికి సమాచారం అందించి, సీసీ పుటేజ్‌ను పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే 4 బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు చోరీకి పాల్పడిన పాత నేరస్థుడు మహ్మద్ ఆదిల్ (28)ను అరెస్ట్ చేశారు. నిందితుడు యజమాని వద్ద గతంలో డ్రైవర్‌గా పనిచేసినట్లు గుర్తించారు. డ్రైవర్‌గా పనిచేసిన సమయంలో షాపునకు సంబంధించిన ఆనవాళ్లు మొత్తం తెలియడంతో దుకాణంలోని 3వ అంతస్తుకు వెళ్లి గ్రిల్ తొలగించి చోరీకి పాల్పడ్డాడని సీపీ అంజనీకుమార్ తెలిపారు. నిందితుడి నుంచి 1009 గ్రాముల బంగారం, 209 గ్రాముల వెండి, రూ.50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసి మొత్తం సొమ్ము విలువ రూ.39లక్షలు ఉంటుందని వివరించారు.