- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెల్త్ మినిస్ట్రీ నివేదిక.. 75శాతం కేసులు టీకా తీసుకున్నవారిలోనే..
సింగపూర్: టీకా వేసుకున్నా కరోనా బారినపడిన ఘటనలు కోకొల్లలు. కానీ, ఆ దేశంలో 75శాతం కేసులు టీకా వేసుకున్నవారే కావడంతో చర్చనీయాంశమైంది. 57 లక్షల జనాభాగల సింగపూర్‌లో ఇప్పటికే 75శాతం మందికి టీకా వేశారు. సగం జనాభా రెండు డోసులూ వేసుకున్నారు. ఈ దేశంలో నాలుగు వారాల్లో 1,096 స్థానికంగా నమోదయ్యాయి. ఇందులో 484 మంది(44శాతం) రెండు డోసులు తీసుకున్నవారు కాగా, 30శాతం మంది సింగిల్ డోసు తీసుకున్నవారున్నారు. 25శాతం మంది మాత్రమే టీకా తీసుకోనివారు.
ఈ కేసుల్లో ఆక్సిజన్ సపోర్ట్ అవసరమైన వారు ఏడుగురు మాత్రమే. అందులో ఆరుగురూ టీకా వేసుకోనివారే కావడం గమనార్హం. టీకా వేసుకున్నా కరోనా సోకుతుందని తెలిసిందేనని, కానీ, అది తీవ్రరూపం దాల్చకుండా వ్యాక్సిన్ అడ్డుకోగలుతుందనడానికి ఈ గణాంకాలు నిదర్శనమని సింగపూర్ హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది. ఎక్కువ మంది టీకా వేసుకున్నందున రిపోర్ట్ అయిన కేసుల్లోనూ వారి శాతమే ఎక్కువ కనిపించిందని వివరించింది.
- Tags
- corona