ట్రాక్టర్ ర్యాలీకి వెళ్తూ ప్రమాదం

by Shyam |
ట్రాక్టర్ ర్యాలీకి వెళ్తూ ప్రమాదం
X

దిశ, జడ్చర్ల :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టానికి కృతజ్ఞతతో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. గురువారం కార్వేన ప్రాజెక్టు వద్ద నిర్వహిస్తున్న ర్యాలీకి వెళ్తున్న క్రమంలో మిడ్జిల్ వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఉరుకొండ మండలం జగబోయిన్ పల్లికి చెందిన డ్రైవర్ రాజేష్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story