పైలెట్ సమయస్ఫూర్తితో ప్రమాద తీవ్రత తగ్గింది

by Anukaran |
పైలెట్ సమయస్ఫూర్తితో ప్రమాద తీవ్రత తగ్గింది
X

దిశ, వెబ్ డెస్క్: కోజికోడ్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభమైంది. దర్యాప్తులో భాగంగా శనివారం నిపుణుల బృందం కాక్ పిట్ వాయిస్ రికార్డర్ ను స్వాధీనం చేసుకున్నది. ప్రమాదానికి ముందు పైలెట్ దీపక్ సాథే విమానం ఇంజిన్ ను ఆపేశాడని, పైలెట్ సాథే సమయస్ఫూర్తితో ప్రమాద తీవ్రత తగ్గినట్లు తెలుస్తోంది.

మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నవారికి కేరళ ప్రభుత్వం కరోనా టెస్టులు చేయనున్నది. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నవారు సెల్ఫ్ క్వారంటైన్ లో వెళ్లాలని సూచించింది.

అదేవిధంగా కోజికోడ్ విమాన ప్రమాద స్థలాన్ని కేంద్రమంత్రి మురళీధరన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రమాదం బాధాకరణమని, ప్రమాదంలో విమానం రెండు ముక్కలైందన్నారు.

Advertisement

Next Story

Most Viewed