ప్రమాద బీమా.. లైఫ్‌కు ధీమా

by Shyam |
ప్రమాద బీమా.. లైఫ్‌కు ధీమా
X

ముంబయి: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ రోడ్ సేఫ్టీ-2018 ప్రకారం రోడ్డు ప్రమాదాలు, సంబంధిత మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. లక్ష జనాభాకు సగటున 22.6 రోడ్ ట్రాఫిక్ మరణాల రేటు ఉందని డబ్ల్యూహెచ్ఓ నివేదిక చెబుతోంది. ఈ గణాంకాలను బట్టి మనదేశంలో ప్రమాద బీమా అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువమంది వ్యక్తిగత ప్రమాద బీమా లాంటి పాలసీల ఉపయోగాన్ని గుర్తించడంలేదని బీమా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రమాద బీమా అంటే…

ప్రమాదాలకు సంబంధించి ఆర్థిక నష్టాలను కవర్ చేసే ప్రత్యేక బీమా పాలసీలు. చికిత్స, ఆస్పత్రి ఖర్చులు, ఆంబులెన్స్ ఖర్చులు, ఆదాయ నష్టం మొదలైనవి ఈ పాలసీలను ఉపయోగించి కవర్ చేస్తారు. ఏదైనా ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే నామినీలు పాలసీ మొత్తాన్ని పొందవచ్చు. దీనివల్ల మరణించిన వ్యక్తి కుటుంబం ఆర్థిక నష్టాలను పూడ్చుకోవచ్చు.

బీమాలు – రకాలు..

నామమాత్ర ప్రీమియంతో..

వ్యక్తిగత ప్రమద బీమా పాలసీ అవసరం కొన్నిసార్లు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ బీమాలో సుమారు రూ.500 నామమాత్రపు ప్రీమియంతో రూ.10 లక్షల వరకు హామీ పొందవచ్చు. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే, తీవ్రమైన ప్రమాదం జరిగి పనిచేయలేని స్థితిలో ఉంటే ఆ కాలంలో ఆర్థిక భారం లేకుండా ఈ ప్రీమియం ఆదుకుంటుంది. ముఖ్యంగా ఈ రకమైన బీమా వల్ల క్లెయిమ్ చేసేందుకు ప్రమాదం ఎంత జరిగింది అనేదానితో సంబంధం లేకుండా లభిస్తుంది. రోడ్డు ప్రమాదమొకటే కాకుండా ఏదైనా ఆటలో తీవ్రమైన గాయాలు కావడం, కాలు, చెయ్యి విరగడం లాంటి చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు కూడా బీమా సంస్థలు వైద్యం కోసం ఖర్చులను భరిస్తాయి.

చెల్లింపు..

ఇందులో ప్రమాదం జరిగిన తీవ్రతను బట్టి బీమా కంపెనీలు చెల్లింపులు జరుపుతాయి. ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే వంద శాతం కంపెనీ చెల్లిస్తుంది. శాశ్వతంగా లేదా పాక్షికంగా వైకల్యం ఏర్పడితే బీమా హామీ మొత్తంలో 75 శాతాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. అంతేకాకుండా ఆటల్లో గాయాల వల్ల ఎముకలు విరిగిపోవడం, తాత్కాలిక వైకల్యం లాంటి వాటికి కూడా పాలసీలను బీమా కంపెనీలు అందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అయితే గాయపడిన వారికి అత్యవసర చికిత్సను అందించేందుకు ఎయిర్ ఆంబుతలెన్స్, అలాగే ప్రమాదానికి గురైన పాలసీదారుడు చెల్లించాల్సి ఉన్న అప్పులకు హామీగా ఉంటూ, ఇవ్వాల్సినా ఈఎంఐలను చెల్లించడం లాంటి సేవలను కూడా బీమా కంపెనీలు నిర్వహిస్తున్నాయి.

ప్రయాణంలో భరోసా..

ఆరోగ్య బీమా లాంటిదే ప్రయాణ ప్రమాద బీమా ఎంతో విలువైనది. ప్రధానంగా ఎక్కువ ప్రయాణాలు చేసేవారికి ఇదే ఎంతో మేలు. తరచుగా ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా ప్రయాణ బీమా పాలసీని కొనుగోలు చేయడం వల్ల కుటుంబానికి ఆర్థికపరమైన భరోసా ఉంటుంది. వ్యక్తిగత బీమా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి కాపాడి ఆర్థికంగా సహాయపడుతుంది.

ఎలాంటి బీమా ఎంచుకోవాలి?

ఆర్థిక నిపుణులు సమగ్ర ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తప్పనిసరిగా ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. దీని ప్రకారం పాలసీదారుడు యాక్సిడెంటల్ కవర్‌ను అదనంగా ఎంచుకోవచ్చు అంటున్నారు. ఒకవేళ వ్యక్తిగత ప్రామాద బీమాలో ఎక్కువ మొత్తాన్ని బీమా కంపెనీలు ఇస్తుంటే వ్యక్తిగత బీమాను ఎంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story