- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైక్ ప్రమాదంలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు
దిశ, హైదరాబాద్: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన హైదరాబాద్ సిటీలో జరిగింది. కరోనా వైరస్ (కొవిడ్-19) కట్టడికి లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కుక్కలు అధికంగా రోడ్లపైకి వస్తున్నాయి. విధులు ముగిసిన అనంతరం బైక్ పై కానిస్టేబుల్ వెళ్తుండగా ఓ కుక్క అడ్డం రావడంతో ప్రమాదానికి గురయ్యాడు.
సుల్తాన్ బజార్ సీఐ సుబ్బరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించే మామిడి రాజు గురువారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్తుండగా చాదర్ ఘాట్ బ్రిడ్జి వద్ద కుక్కలు అడ్డు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా తన ద్విచక్ర వాహనం కిందపడి డివైడర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదంలో రాజు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్రమైన దెబ్బ తగలడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తోటి ఉద్యోగికి ప్రమాదం కావడంతో సుల్తాన్ బజార్ పోలీసులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
Tags: accident, dog,constable, early morning, Serious injuries