- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బావిలో పడ్డ కారు.. ఒకరు మృతి
దిశ, నల్లగొండ: ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడటంతో ఒకరు మృతిచెందగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండకు వెళ్లే దారిలోని పల్లెర్ల స్టేజి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి పల్లెర్ల స్టేజీ దగ్గర రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది. ఆ సమయంలో కారులో ఇద్దరు ఉన్నారు. ఓ వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డారు. మరొకరు కారులోనే ఇరుక్కుపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ శివనాగ ప్రసాద్ స్థానికుల సాయంతో కారులో చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీశారు. కానీ, అతను అప్పటికే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వెల్లడించారు.
tags : accident, car falling in well, 2 in car, one escape, another one stuck