- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగం వదులుకుంటే భారీ ఆఫర్
దిశ, వెబ్‌డెస్క్: ఐటీ దిగ్గజ కంపెనీ యాక్సెంచర్ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కొవిడ్-19 నేపథ్యంలో అన్ని రంగాల్లో ఆదాయాలు క్షీణించాయి. ముఖ్యంగా ఐటీ రంగంపై ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రభావం అధికం. ఈ క్రమంలోనే కొత్త నియామకాలు ఆగిపోయాయి. తాజాగా యాక్సెంచర్ కంపెనీ ఉద్యోగులను వదులుకోవడానికి భారీగా ఆఫర్ ప్రకటించింది. కొత్తగా తొలగింపుల జాబితాలో ఉన్న వారికి 7 నెలల జీతాన్ని అందిస్తోంది. ఇందులో మూడు నెలల కాలానికి నోటీస్ పీరియడ్‌గా, మరో నాలుగు నెలల అదనంగా చెల్లించనుంది.
పనితీరు ఆధారంగా 5 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. సాధారణంగా మెజారిటీ ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగింపు సమయంలో రెండు నుంచి మూడు నెలల జీతాలను మాత్రమే చెల్లిస్తాయి. కానీ, యాక్సెంచర్ కంపెనీ అదనంగా నాలుగు నెలలు అదనంగా అందిస్తోంది. ప్రస్తుత తొలగింపులు సాధారణమేనని, కొత్త నియామకాలు కూడా ఉంటాయని కంపెనీ వెల్లడించింది. టెక్నాలజీ డిమాండ్ లేని ప్రాంతాల్లో ఈ ఉద్యోగాల కోత ప్రభావం ఉందని, అదేవిధంగా డిజిటల్ టెక్నాలజీ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కంపెనీలు కొత్త ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. డిజిటల్ సేవల ద్వారా యాక్సెంచర్ సంస్థ 70 శాతం ఆదాయాన్ని సాధిస్తోంది. కాగా, కరోనా నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకున్న కారణంగా గత త్రైమాసికంలో యాక్సెంచర్ కంపెనీ ఆదాయం 1.3 శాతం మేర పెరిగింది.