ఇకపై బందోబస్తుకు.. ఏసీబీ, సీఐడీ, విజిలెస్స్

by Aamani |   ( Updated:2020-04-04 05:07:25.0  )

దిశ, నిజామాబాద్: కరోనా నేపథ్యంలో తెలంగాణలో శాంతి భద్రతల పర్యవేక్షణ, ప్రజలెవరూ రోడ్ల మీదకు రాకుండా చూడటం, వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం ఏసీబీ, సీఐడీ, విజిలెస్స్ సేవలను కూడా వినియోగించుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్‌ బందోబస్తులో ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్‌ సిబ్బంది కూడా పాల్గొంటారని వెల్లడించారు. ఇప్పటి వరకు లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇకపై వారితోపాటే ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్‌ కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులు సైతం విధుల్లో పాల్గొనేలా చూడాలని డీజీపీ ఉన్నతాధికారులను కోరారు.

tags: carona, lockdown, acb,cid, vigilens officers on duty on lockdown, ts dgp orders

Advertisement

Next Story