డబ్బులను అక్కడ కుక్కిన ఆఫీసర్.. అవాక్కయిన ఏసీబీ అధికారులు

by Sumithra |   ( Updated:2021-11-24 07:59:34.0  )
Shanta Gowda
X

దిశ, డైనమిక్ బ్యూరో : లక్షల జీతం వస్తున్నా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అక్రమ సంపాదన కోసం అడ్డదార్లు తొక్కుతున్నారు. లంచాలు వసూలు చేస్తూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరుకుతున్నారు. కొందరు అధికారులైతే ఒకసారి ఏసీబీకి పట్టుబడి కొంత కాలానికి తిరగి డ్యూటీలో జాయిన్ అవ్వగానే మళ్లీ దందా మొదలుపెట్టి రెండోసారి ఏసీబీకి దొరుకుతున్నారు. అయితే, కర్ణాటక రాష్ట్రంలో అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమంగా సంపాదించిన డబ్బును అటు బ్యాంకులో వేయలేక, ఇంట్లో లాకర్ లో ఉంచలేక ఏకంగా పైపులో దాచిపెట్టారు.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని కలభురాగి జిల్లాలో పీడబ్ల్యూడీ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ ఇంజనీర్ శాంతా గౌడ ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. అక్రమ సంపాదనను దాచేందుకు ఎంతో ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఎవరికీ తెలియకుండా ఏర్పాటుచేసిన పైపులైన్ లో దాచిన నల్లధనాన్ని గుర్తించి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. డ్రైనేజీ పైపు నుంచి రూ.13 లక్షలు వెలికితీసినట్లు వెల్లడించారు. శాంతగౌడ ఇంట్లో మొత్తం రూ.54లక్షల అక్రమ నగదు, బంగారు ఆభరణాలను అధికారులు సీజ్ చేశారు.

Advertisement

Next Story