దేవికారాణిని మరోసారి వదల్లేదు

by  |
దేవికారాణిని మరోసారి వదల్లేదు
X

దిశ, క్రైమ్ బ్యూరో : గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఈఎస్ఐ స్కామ్‌లో మాజీ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో 8 మందిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్టుగా గుర్తించిన ఏసీబీ గతేడాది కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న ఈ కేసులో తాజాగా మాజీ డైరెక్టర్ దేవికారాణితో పాటు ఫార్మసిస్ట్ నాగలక్ష్మీలు ఓ ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు రియల్ వ్యాపారికి రూ.4.47 కోట్లు చెల్లించినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

అంతే కాకుండా, తాజాగా మందుల కొనుగోలు వ్యవహారంలో నకిలీ ఇండెంట్, మందుల కొనుగోలులో తక్కువ ధరల మందులను ఎక్కువగా కోడ్ చేసి అక్రమాలకు పాల్పడ్డారనే విషయాన్ని కూడా ఏసీబీ అధికారులు కనుగొన్నారు. ఈ సందర్భంగా రూ.6.5 కోట్లు అక్రమాలకు పాల్పడినట్టుగా తేల్చారు.

ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న మాజీ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ కల్వకుంట్ల పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ కూరపాటి వసంత ఇందిరతో పాటు ఓమిని మెడి కంచర్ల శ్రీహరి బాబు అలియాస్ బాబ్జీ, ఓమిని హెల్త్‌కేర్ ప్రతినిధి కంచర్ల సుజాత, లీజెండ్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధి కుక్కల కృపాసాగర్ రెడ్డి, హోమోక్యూ రీజినల్ మేనేజర్ టంకశాల వెంకటేష్, ఓమిని మెడికల్ ఉద్యోగి బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజులపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ విషయాలను గురువారమే వెల్లడించిన ఏసీబీ అధికారులు శుక్రవారం దేవికారాణితో పాటు మరో 8 మందిని అరెస్టు చేసి, కోర్టు ముందు హాజరుపర్చారు.


Next Story

Most Viewed