దేవికారాణి ఇంట్లో కోట్ల నగలు ఎక్కడివి?

by Shyam |   ( Updated:2020-09-03 04:17:13.0  )
దేవికారాణి  ఇంట్లో కోట్ల నగలు ఎక్కడివి?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే దేవికారాణి రూ. 10 కోట్ల నగల పై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా.. ఆమె ఇంట్లో లభించిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ ముమ్మరం చేస్తున్నారు. అలాగే, నగలు కొనుగోలు చేసిన పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల ఓ బిల్డర్‌కు ఇచ్చిన రూ. 4.47 కోట్లు.. ఎక్కడి నుంచి తెచ్చారన్న అంశం పై కూపీ లాగుతున్నారు. దీంతో మరోసారి దేవికారాణికి నోటీసులు ఇచ్చి ఏసీబీ అధికారులు వివరాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story