ఈఎస్ఐ స్కామ్: సంచలన విషయాలు వెలుగులోకి 

by srinivas |
ఈఎస్ఐ స్కామ్: సంచలన విషయాలు వెలుగులోకి 
X

ఈఎస్ఐ 2014 నుండి 2019 మధ్య కాలంలో మందుల కొనుగోలు విషయంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఏసీబీ జాయింట్ డైరెక్టర్ పి.వి రవికుమార్ పలు సంచలన విషయాలు వెల్లడించారు.

సుమారు 970 కోట్లు బడ్జెట్ కేటాయింపులుజరిగాయన్నారు. మందులు కొనుగోళ్లు విషయంలో 106 కోట్లు విలువచేసే మందులు కాంట్రాక్టు లేకుండా కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. లక్షకు మించిన ఏ విధమైన కొనుగోళ్లయినా టెండర్ ప్రక్రియ తోనే చేయాలి. కానీ అన్ని రకాల నిబంధనలు తుంగలో తొక్కి ధనలక్ష్మి అనే ఉద్యోగిని ద్వారా అప్పటికపుడు బోగస్ కంపెనీ పుట్టించి మందులు సప్లై చేశారు. కడప జాయింట్ డైరెక్టర్ జనార్దన్ 400 కోట్లు విలువైన మందులు అవసరంలేనివి కొనుగోళ్లు చేశారని సంచలన విషయాలు వెల్లడించారు..

లోపాయకారి వ్యవహారాలు చాలా జరిగాయి, అనేదానికి అచ్చేనాయుడు గారి సంతకాలు చేసినట్లు గుర్తించామన్నారు. మా విచారణలో తేలిన అంశాలు అన్నీ ఫేక్ అని నిర్ధారణ జరిగింది. 200 రూపాయలు అయ్యే ఈసీజీ కి 480 రూపాయల ఛార్జ్ చేశారు. అన్ని రకాల అధికార దుర్వినియోగం జరిగింది. టెండర్లు లేకుండానే కొనుగోళ్లు చేశారు. బిల్లులు కూడా అన్నీ ఒరిజినల్స్ కావు అని వెల్లడించారు రవి కుమార్. 12 మంది ముద్దాయిలు అరెస్ట్ చేసామని చెప్పిన ఆయన దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇంకా చాలా మందిని విచారించాల్సి ఉందని కూడా తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed